అవిశ్వాస తీర్మానంపై ఏ పార్టీకి మద్దతు?.. రేపు వెల్లడించనున్న టీఆర్‌ఎస్‌

  • కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ, వైసీపీ నోటీసులు
  • అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనున్న టీఆర్‌ఎస్‌
  • తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ను కోరిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తోన్న టీడీపీ, వైసీపీలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ అధికార టీఆర్‌ఎస్ పార్టీ స్పందించింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. అయితే, టీడీపీ, వైసీపీల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న విషయాన్ని టీఆర్ఎస్ ఇంకా నిర్ణయించుకోలేనట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి మద్దతు ఇస్తామనే విషయాన్ని రేపు వెల్లడిస్తామని ప్రకటించింది. కాగా, తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ టీఆర్‌ఎస్‌ను కోరినట్లు సమాచారం. 
Go Back to Shorts
TRS
Telugudesam
YSRCP
Special Category Status
no confidence motion

More Telugu News